గుజరాత్ ఎన్నికల్లో కోటీశ్వరులదే విజయం!

334
- Advertisement -

ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో ఏకాధిపత్యం కొనసాగిస్తున్న కాషాయపార్టీ ఈ ఎన్నికలతో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. గతంతో పోలిస్తే ఈసారి సీట్లు కూడా విపరీతంగా పెరగడం గమనార్హం. మొత్తం 182 స్థానాలకు గాను 150 కి పైగా సీట్లు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది కాషాయ పార్టీ. ఇదిలా ఉంచితే ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలలో దాదాపు 83 శాతం అందరూ కోటీశ్వరులేనట. ఏడీఆర్ అందించిన నివేధిక ప్రకారం గెలుపొందిన 151 మంది ఎమ్మెల్యేలలో ఆర్థికంగాను, పారిశ్రామికంగాను ఆస్తులు కలిగి కోటీశ్వరులుగా వెలుగొందుతున్న వారే అని ఆ నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా బీజేపీ నుంచి గెలుపొందిన 132 ఎమ్మేల్యేలు ఆర్థికంగా బలమైన నేతలేనట. అలాగే కాంగ్రెస్ నుంచి 14 మంది, ఆమ్ పార్టీ నుంచి ఒకరు ఈ కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. కాగా బీజేపీ నుంచి పోటీ చేసిన జెఎస్ పటేల్ రూ.661 కోట్ల విలువైన ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే బీజేపీ తరుపున ఉన్న మరో 40 ఎమ్మెల్యేలపై వివిద రకాల కేసులు ఉన్నట్లు కూడా ఆ నివేదిక వెల్లడించింది. దీంతో గుజరాత్ లో బీజేపీ గెలుపుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అంతా కోటీశ్వరులనే ఎంచుకున్న మోడీ అమిత్ షా ద్వయం.. లెక్కకు మించి డబ్బు పంపిణీ చేయడం వల్లే కాషాయ పార్టీ రికార్డ్ విజయం సాధించిందనే వాదన వినిపిస్తోంది.

అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎంతటి అక్రమాలు చేయడానికైనా సిద్దంగా ఉండే కాషాయ పార్టీ.. ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అధికారం కోసం గుజరాత్ లో ఓట్లు కొనడం పెద్ద విషయమేమి కాదని, అందుకే కోటీశ్వరులకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, డబ్బును ఎరగా వేసి ఓట్లు దండుకొందనే వాదనకు ఏడీఆర్ ఇచ్చిన నివేదికతో ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇలా బీజేపీ ఇష్టారాజ్య అక్రమ పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాజకీయవాదులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

పవన్ తెలంగాణలో సత్తా చాటుతారా ?

టీ కాంగ్రెస్ నేతల్లో ముసలం.. !

రేవంత్‌కు షాక్..కొండా రాజీనామా

- Advertisement -