- Advertisement -
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులకు సాయం అందించేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటుచేసింది టాలీవుడ్. దీనికి చిరంజీవితో పాటు పలువురు సారధ్యం వహిస్తుండగా ఇప్పటికే పలుమార్లు కార్మికులకు సాయం అందించింది.
తాజాగా మరోసారి సినీ కార్మికులకు సాయం అందించాలని సీసీసీ నిర్ణయించినట్లు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. షూటింగ్‌లు ప్రారంభం కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సీసీసీ తరపున మూడోసారి సాయం అందించనున్నామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 వేల మందికి సాయం అందిస్తున్నామని…క్లిష్ట పరిస్ధితుల నుండి గట్టెక్కేవరకు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు చిరు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేశారు.
- Advertisement -