కార్మికులకి అండగా జగపతిబాబు..

118
jagapathi babau

లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా నిలిచారు హీరో జగపతి బాబు. ఇవాళ 400 మందికి బియ్యం, పప్పు,నూనె, మాస్క్‌లు అందించారు జగపతిబాబు.

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి గతంలో జ‌గ‌ప‌తి బాబు ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విష‌యం తెలిసిందే. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి వాటిని అందించారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులు వ‌ల‌న వినోద ప‌రిశ్ర‌మ పూర్తిగా స్తంభించింది. వీరికి అండ‌గా చిరంజీవి నేతృత్వంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటుకాగా దీనిద్వారా సినీ కార్మికులను ఆదుకుంటున్నారు.