సమాజం పట్ల బాధ్యత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : సుషాంత్

250
sushanth

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతుంది. స్పోర్ట్స్ స్టార్స్ నుంచి మొదలకుంటే సిన్మా స్టార్టదాక అందరిని కదిలించింది. ఏరు గట్టునుంచి స్టార్ట్ అయి ఏరియల్ వ్యూలో చూసేదాక చేరింది.

ఇప్పుడు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మనుషల్నే కాదు బొజ్జ గణపయ్యకు తోడుగా గింజల్ని పంచి నేలతల్లికి మొక్కల్ని మొక్కలు తీర్చుకొమ్మంటుంది.
ఇంతటి అపురూపమైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో అక్కినేని అందగాడు చైతన్య నుంచి ఛాలెంజ్ స్వీకరించిన ఛార్మింగ్ స్టార్ సుషాంత్ ఈ రోజు బంజారాహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు.

అనంతరం సుషాంత్ మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ గారు, ఒక నాయకుడిగా తన ప్రజాసేవను కొనసాగిస్తూనే.. ఒక మంచి ఆశయం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమం రూపొందించడం, దేశవ్యాప్తంగా ఇంతమందిని అందులో భాగస్వామ్యం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.మంచి కార్యక్రమం ప్రతీ ఒక్కరికి చేరాలనే ఆశయానికి నా వంతు బాధ్యతగా నేను నా మిత్రులు హీరోయిన్ పూజాహెగ్డే, సాహో దర్శకుడు సుజిత్ కి, నటి ఐశ్వర్య రాజేశ్ కి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కష్యప్ కి ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలియజేశారు.