స్టార్ హీరో సోదరిని మోసం చేశాడట

26
- Advertisement -

టాలీవుడ్ హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. సెప్టెంబర్ 12న నాగసుశీల మరికొంత మంది కలిసి.. శ్రీ నాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్‌నర్ చింతలపూడి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇవ్వడంతో ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా భూవివాదాలు జరుగుతున్నాయి. దీంతో హీరో నాగార్జున సోదరిపై కేసు నమోదు అయింది. అయితే, నాగసుశీల – చింతలపూడి శ్రీనివాసరావు మధ్య గతంలో మంచి స్నేహ బంధం ఉండేది.

ఆ సమయంలోనే వారిద్దరూ చాలా దగ్గర అయ్యారని.. ఓ దశలో నాగసుశీల కూడా తన భర్తని వదిలి.. చింతలపూడి శ్రీనివాసరావుతోనే ఉన్నారని టాక్. వీరి బంధం పై బతికి ఉన్న రోజుల్లో అక్కినేని నాగేశ్వరావు కూడా తన అసహనాన్ని వ్యక్త పరిచారట. ఐతే, కాలం గడిచే కొద్దీ నాగసుశీల – చింతలపూడి శ్రీనివాసరావు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ లోపు వారి మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే నాగసుశీల తరుచూ చింతలపూడి శ్రీనివాసరావును బెదిరిస్తూ వస్తున్నారట.

మొత్తమ్మీద చింతలపూడి శ్రీనివాసరావు ఇంటిపై దాడి కూడా చేయించారు. ఇదే విషయం పై నాగసుశీల గారితో మాట్లాడితే.. ఆమె ఎమోషనల్ అయ్యారు. ” నా పై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. కావాలని కొంతమంది ఇటు వంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దు. ఇక చింతలపూడి శ్రీనివాసరావు నన్ను చాలా రకాలుగా మోసం చేయడం జరిగింది. నన్ను వాడుకుని.. చివరకు అతను నన్నే మోసం చేశాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Also Read:మెగా ఇంట్లో పెద్ద పండగ.. ఎందుకంటే?

- Advertisement -