షాకింగ్.. ఆ యాంకర్ కి అరుదైన వ్యాధి

22
- Advertisement -

ఎప్పుడూ చలాకీగా ఎంతో ఉత్సాహంగా కనిపించే యాంకర్ సుమ, చాలా సంవత్సరాలుగా ప్రపంచానికి తెలియని తీవ్ర బాధతో తనలో తానే ఎంతో నలిగిపోతుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ మాట్లాడుతూ.. తాను చాలా ఏళ్ళ నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమెకు ‘కీలాయిడ్ టెండెన్స్’ అనే అరుదైన చర్మ వ్యాధి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల అనేక సంవత్సరాలుగా ఎన్నో బాధలు పడుతున్నానని, ఒక్కోసారి కన్నీళ్లు పెట్టే ఓపిక కూడా ఉండేది కాదు అని, దీనికితోడు నిత్యం వర్క్ చేయాల్సి వచ్చేది అని సుమ తెలిపారు.

ముఖ్యంగా ఈ సమస్య వల్ల తన ముఖానికి మేకప్ వేసినప్పుడు, తీసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని సుమ అన్నారు. ఒక వేళ చర్మానికి గాయమైతే.. ఆ గాయం మరింత పెద్దదిగా మారేదని ఆమె చెప్పుకొచ్చారు. ఓ దశలో ఇక పని చేయకూడదు అని సుమ నిర్ణయం కూడా తీసుకున్నారట. ఆ సమయంలోనే ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందట. ఇక చేసేదేం లేక, మళ్లీ యాంకర్ గా చేయాలని సుమ నిర్ణయం తీసుకున్నారు. యాంకరింగ్ అనేది కష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే. మధ్యలో గ్యాప్ ఇస్తే.. మన స్థానం మనకు దక్కదు. అందుకే.. నా ప్లేస్ ను కాపాడుకోవడానికి నేటికీ తాను పోరాటం చేస్తున్నాను అని ఆమె చెప్పారు.

Also Read:మెగా ఇంట్లో పెద్ద పండగ.. ఎందుకంటే?

ఇక తనపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై కూడా సుమ మాట్లాడారు. “ఆన్ లైన్ వేదికగా తరచూ ట్రోల్స్ ఎదురవుతూనే ఉంటాయి. మొదట్లో వాటి వల్ల నేను కూడా ఎంతో ఇబ్బందిపడ్డా. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా. యాంకర్ సుమ అనే నా పై విమర్శలు చేసే వారందరికీ నా వర్క్ తోనే సమాధానం ఇవ్వాలనుకుంటున్నా”అని సుమ చెప్పారు.

Also Read:ఎజెండా లేని సమావేశాలెందుకు ?

- Advertisement -