ట్రంప్ చిన్నచూపు చూశారు..అందుకే కరోనా:చైనా

240
trump
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.కరోనాతో ఇప్పటివరకు అమెరికాలో లక్షల సంఖ్యలో మృత్యువాతపడగా తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న భార్య మిలానియా ట్రంప్‌ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతుండగా త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ట్వీట్ చేశారు. కరోనా విషయంలో ట్రంప్ చిన్న చూపు చూశారని, ట్రంప్ దంపతులు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించారని చైనా అధికారిక మీడియా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. అమెరికాలో కరోనా పరిస్థితి ఎలా ఉన్నదో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయని వెల్లడించింది.

- Advertisement -