సుంకం తగ్గించాల్సిందే… మోడీకి షాకిచ్చిన ట్రంప్‌…!

381
modi trump

జీ 20 సదస్సుకు ముందు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ట్విట్టర్ వేదికగా మోడీని ఉద్దేశిస్తూ టారిఫ్‌లు తగ్గించాలని డిమాండ్ చేశారు. భారత్ చాలా ఏళ్లుగా అమెరికా ప్రొడక్టుల దిగుమతులపై అధిక టారిఫ్‌లను విధిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఇటీవలనే మళ్లీ సుంకాలను పెంచింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. టారిఫ్‌లను వెనక్కు తీసుకోవలసిందే అని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొంటూ ఝలక్ ఇచ్చారు.

స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకాల విధించడంతో సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భారత్ సుంకాలు తగ్గించాలని అమెరికాను కోరుతూనే వచ్చింది. అయితే ఫలితం దక్కలేదు. అంతేకాకుండా జీఎస్‌పీ హోదాను కూడా ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచింది.

టీ20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ వెళ్లారు మోడీ. వివిధ దేశాలకు చెందిన కీలక నేతలతో పాటు ట్రంప్‌ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌తో ఈ సమావేశాల్లో భేటీ కానుండటం..ఈ నేపథ్యంలోనే ట్రంప్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.