హెచ్‌ 1బీ వీసాలు..లాటరీ విధానం రద్దు!

75
trump

హెచ్‌ 1వీ బీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసాల మంజూరులో ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

భారత్‌ సహా పలు దేశాల నుంచి లక్షలాది మంది హెచ్‌ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటుండగా ఏటా 65 వేల మందికి కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానంలో వీసాలు జారీ చేస్తున్నారు. ఈ విధానం ద్వారా తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను సంస్థలు రప్పించుకోవడంతో అమెరికా పౌరులు ఉపాధి కోల్పోతున్నారని ట్రంప్‌ సర్కార్‌ లాటరీ విధానానికి స్వస్తి పలకాలని ప్రతిపాదించింది.

తద్వారా అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కలిగి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే డిసెంబరు 31 వరకు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల మంజూరుపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.