యుఎస్‌లో కరోనా విజృంభనకు ట్రంపే కారణం..

227
bill gates

ప్రపంచదేశాలను కరోనా గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోగా యుఎస్‌లో కరోనా విజృంభణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకుడు బిల్ గేట్స్.

అమెరికాలో కరోనా విజృంభణకు డొనాల్డ్ ట్రంపే కారణమన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికాకు చేరుకున్నార‌ని, వారికి కరోనా టెస్టులు చేయ‌లేద‌న్నారు.

కరోనా వచ్చిన వారికి కనీసం క్వారెంటైన్ కేంద్రాలకు కూడా తరలించలేదని ఆరోపించిన బిల్‌గేట్స్….కరోనాను కట్టడిచేసే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ప్రయాణాలపై ఆంక్షలు విధించిందని, ఆ నిర్ణయమే కొంప ముంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.