ఏపీ సీఎం జగన్ ఇంట్లో విషాదం..

186
cm jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంట విషాదం నెలకొంది. వైఎస్ జగన్ మామ,భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతిచెందారు. కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిన్న అర్ధరాత్రి పరిస్ధితి విషమించడంతో కన్నుమూశారు. వృత్తిరిత్యా డాక్టర్ అయిన గంగిరెడ్డి పేదల వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. పులివెందుల ఎంపీపీగా పనిచేశారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.