బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్…తగ్గిన చికెన్ ధరలు!

164
chicken
- Advertisement -

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాలను బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వణికిస్తుండటంతో చికెన్ ధరలు దిగొచ్చాయి. కోడి మాంసం కొనేందుకు జనాలు ముందుకు రాకపోవడంతో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఢిల్లీ ఘాజీపూర్‌ మండిలో చికెన్‌ రేట్లు 40-50 శాతం తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లోనూ బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. గిరాకీ లేకపోవడంతో అటు చికెన్‌ వ్యాపారులు, పౌల్ట్రీ యాజమానులు ధరలు తగ్గిస్తున్నారు. గుడ్లు కొనేందుకు కూడా ఎవరూ ముందుకురావడం లేదు.

హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ సేమ్‌ సీన్‌ కనిపిస్తోంది. హర్యానాలోని పంచకుల జిల్లాలో ఏకంగా నాలుగు లక్షల కోళ్లు చనిపోయాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హర్యానా , హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించింది. బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాప్తితో అటు పౌల్ట్రీ యాజమానులు, ప్రజల్లో ఆందోళనలను తొలగించేందుకు ఆయా రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

- Advertisement -