దేశంలో 24 గంటల్లో 18,222 కరోనా కేసులు…

52
covid 19

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 228 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,24,190 యాక్టివ్ కేసులుండగా 1,50,798 మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో కరోనా కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తర్వాతి స్ధానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ఉన్నాయి.