చికెన్ లివర్.. తింటే ఏమౌతుంది?

37
- Advertisement -

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తింటే మాంసాహారాలలో చికెన్ మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎంతో మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. కనీసం వారంలో రెండు లేదా మూడు సార్లు కూడా చికెన్ తినే వారు లేకపోలేదు. అయితే చికెన్ లో చాలామంది లివర్ ను అవైడ్ చేస్తుంటారు. కొంతమంది చికెన్ లివర్ ను ఇష్టంగా తింటే మరికొంత మంది పూర్తిగా అవైడ్ చేస్తుంటారు. అయితే చికెన్ లివర్ తినడం వల్ల చాలానే లాభాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. చికెన్ లివర్ లో మిగిలిన వాటితో పోల్చితే పోషకాల శాతం ఎక్కువ. ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ఐరన్ లోపం ఉండేవాళ్లు కచ్చితంగా చికెన్ లివర్ తినాలని చెబుతున్నారు నిపుణులు. ఇంకా చికెన్ లివర్ లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, గుణాలు కూడా అధికంగా ఉంటాయి. .

తద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శాతం పెంచడంలో చికెన్ లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది చికెన్ లివర్ ను కొవ్వు పదార్థంగా భావిస్తుంటారు. అందులో నిజం ఉన్నప్పటికి బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడంలో సహాయ పడుతుంది. ఇంకా చికెన్ లివర్ లో విటమిన్ బి కాంప్లెక్స్ మెండుగా లభిస్తుంది. తద్వారా గర్భిణీలు, బాలింతలు చికెన్ లివర్ తరచూ తింటే శరీరంలో మెటబాలిజం పేగుతుంది. ఇంకా ఇందులో సెలీనియం, పోలేట్, రిబోఫ్లావిన్ వంటి ఇతర మూలకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా సీజనల్ గా వచె ఇతరత్రా వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. కాబట్టి చికెన్ లివర్ ను తినడం మంచిదేనని చెబుతున్నారు ఆహార నిపుణులు. అయితే ప్రతిరోజూ చికెన్ తినడం ఏమాత్రం మంచిది కాదట. కాబట్టి వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినే విధంగా ఆహార పట్టిక ను ఋపొందించుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

Also Read:KTR:స్థానికులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

- Advertisement -