డెంగ్యూ యమ డేంజర్.. ఇవి తినండి!

30
- Advertisement -

ఈ వర్షాకాలం చివరి దశకు రావడంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి, దాంతో కొన్ని సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మద్య దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దోమ కాటు వల్ల వచ్చే ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డెంగ్యూ బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, నిసత్తువ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా కొందరిలో కళ్ల మంటలు కూడా ఉంటాయి. డెంగ్యూ తీవ్రత పెరిగితే విరోచనాలు, వాంతులు ఏర్పడి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అందుకే డెంగ్యూ పట్ల అశ్రద్ద వహించరాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. .

ఇంకా డెంగ్యూ బారిన పడిన వారిలో రోగనిరోదక శక్తి తగ్గడం, రక్తంలో ప్లేట్స్ కౌంట్ పడిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే తినే ఆహారం విషయంలో శ్రద్ద వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. కివీపండ్లు, నారింజ, బత్తాయి వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఉన్న పదార్థాలు బాగా తింటే శరీరంలో రోగనిరోధక శక్తి వేగంగా పెరుఘుతుంది.

ఇంకా దానిమ్మ, బొప్పాయ్ వంటి పండ్లను కూడా తినడం మచిదట, ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి, శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంకా రక్తంలో ప్లేట్స్ కౌంట్ పెరగడానికి కూడా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కొబ్బరి నీరు త్రగాలట. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతు తక్షిణ శక్తిని ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి డెంగ్యూ బారిన పడిన వారు సరైన మెడిసన్ తీసుకుంటూనే.. వైద్యుల సలహా మేరకు పైన చెప్పిన విధంగా శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:‘జవాన్’..సింగిల్ షాట్ గ్లింప్స్

- Advertisement -