విజయవాడ వాసులను వణికిస్తున్న చెడ్డీ గ్యాంగ్..

46
cheddy gang

చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు వింటేనే భయపడిపోతున్నారు బెజవాడ వాసులు. దీంతో అనుమానితలుపై ప్రజలు దాడులు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ అనుమానితుడిగా భావించి రౌడీ షీటర్ ఏబేలు పై దాడిచేశారు స్థానికులు. పాల ఫ్యాక్టరీ సమీపంలో కూలీల నుంచి డబ్బు లాక్కోగా ఏబేలును వెంబడించారు స్థానికులు.

బైక్ మీద పారిపోయే క్రమంలో ఏబేలు కింద పడిపోగా స్థానికుల నుంచి తప్పించుకునేందుకు నున్న సమీపంలోని చెరువులో దూకేశారు ఏబేలు. ఏబేలుని చెడ్డీ గ్యాంగ్ కు చెందిన వాడిగా భావించి దాడి చేశారు స్థానికులు. చెరువులోంచి లాక్కొచ్చి ఏబెలును స్ధానికులు చితకబాదారు. కాళ్లూ, చేతులను వైర్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.