తెలుగువారికి సాయం అందిస్తాం:తానా అధ్యక్షుడు అంజయ్య

99
tana

ప్రవాస తెలుగు వారికి సహాయం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్ణయించాయి. తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కార్యాలయాన్ని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…రాష్ట్రంలో ఐటీ, ఐటీఈఎస్‌ రంగాలలో పెట్టుబడులపై అమెరికాలోని తెలుగు ప్రవాసులతో సహకరించే మార్గాలను అన్వేషిస్తామన్నారు.

ఏపీఎన్‌ఆర్‌టీ ట్రస్ట్ ద్వారా సంస్కృతి, తెలుగు భాషపై విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులకు ప్రవాసాంధ్ర భరోసా బీమాను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రవాసుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ చాలా బాగున్నందన్నారు.