చంద్రయాన్ -3..తెలంగాణ కీలక నిర్ణయం

15
- Advertisement -

దేశమంతా చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూలు ప్రకారం బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో దేశమంతా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

తాజాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం స్కూళ్లు సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయనున్నాయి. లైవ్‌ స్ట్రీమింగ్ కోసం అన్ని స్కూళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది

రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు చంద్రయాన్‌ ల్యాండింగ్‌కు సంబంధించి లైవ్‌ వీడియోను స్కూల్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

Also Read:చంద్రయాన్-3 కోసం ప్రత్యేక పూజలు..

- Advertisement -