Chandrayaan 3:జయహో ఇస్రో

54
- Advertisement -

అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదరుచూసిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దక్షిణ ధృవాన్ని ముద్దాడింది. జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు చంద్రుడ్ని ముద్దాడింది.

చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3 . ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, భారీ ప్రయోగం ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.613 కోట్ల ఖర్చుచేశారు. చంద్రుడిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో జాబిల్లిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.ఇక చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది.

Also Read: CM KCR:మెదక్‌కు రింగ్ రోడ్డు

ఇటీవలే రష్యా లూనా-25 దక్షిణ ధ్రువంపై దిగడానికి ప్రయత్నించి కుప్పకూలింది. దీంతో అందరి కళ్లు చంద్రయాన్‌ 3పై ఉండగా వాటిని నిజం చేస్తూ చంద్రుడిపై అడుగుపెట్టింది విక్రమ్ ల్యాండర్.

చంద్రయాన్-3కి ఆర్బిటార్ లేదు. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఆ ఆర్బిటర్ జీవిత కాలం ఏడాది. అది ఇప్పుడు చంద్రయాన్-3కి సాయం చేస్తుంది. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రొపల్సన్ మాడ్యూల్ జీవిత కాలం 3 నుంచి 6 నెలలు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే.

Also Read:ఏపీలో కూడా బండి తీరు మారలే!

- Advertisement -