ఏపీలో కూడా బండి తీరు మారలే!

23
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే టక్కున బిజెపి మాజీ అద్యక్షుడు బండి సంజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి మరి. ప్రజల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారని బండి సంజయ్ పై ఓ విమర్శ ఉంది. ఈ విమర్శ రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఆయన చేసే ఏ ప్రసంగం చూసిన మతాన్ని అడ్డుపెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉంటాం. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల టైమ్ లోనూ, ఆయా నియోజిక వర్గాల్లో జరిగిన బైపోల్స్ టైమ్ లోనూ మతమపరమైన విద్వేషాలకు కారణమయ్యారు బండి సంజయ్.

ఇక ఇప్పుడు ఏపీలో కూడా తన వైఖరిని ప్రదర్శిస్తున్నారయన ఇటీవల జాతీయ ప్రదాన కార్యదర్శి పదవి చేపట్టిన బండి సంజయ్ ఇటీవల ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వైఎస్ జగన్ తాగుబోతులను తాకట్టు పెడుతున్నారని, వైసీపీ దొంగఓట్లతో గెలిచారని.. ఈ రకంగా రాజకీయ విమర్శలు చేసిన బండి సంజయ్ వెంటనే మతపరమైన విమర్శలకు తెర తీశారు.

వైసీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానని చెప్తూ.. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. అంతటితో ఆగకుండా ఒక మతనికే కొమ్ము కాస్తు ఆ మతమే అధికారం చెలయిస్తోందని చెప్తూ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు బండి సంజయ్. దింతో ఆయన చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు మండి పడుతున్నారు. ఎక్కడైనా తీరు మార్చుకోవా.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే ఉద్దేశ్యామా అంటూ బండి సంజయ్ వైఖరిని ప్రశ్నిస్తున్నారు కొందరు రాజకీయ వాదులు.

Also Read:కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్ అవుతుందా?

- Advertisement -