చంద్రబాబు ‘ఝలక్’.. పవన్ షాక్ !

28
- Advertisement -

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు మొత్తం టీడీపీ జనసేన పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో జత కట్టిన ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా.. మిగిలిన స్థానాల్లో జనసేన, బీజేపీ పార్టీలు పోటీ చేయనున్నాయి. అయితే సీట్ల కేటాయింపులో జనసేన పార్టీకి భారీ నష్టం జరిగిందని ఆ పార్టీలో అంతర్గతంగా అసంతృప్త నినాదాలు వినిపిస్తున్నాయి. పవన్ పూర్తిగా చంద్రబాబు మాయలో పడిపోయారని, ఎంత తక్కువ సీట్లు కేటాయించిన పవన్ నోరు మెదపడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. .

మొదట 24 సీట్లు కేటాయించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మూడు స్థానాలను కుదించి 21 సీట్లకే జనసేన పార్టీని పరిమితం చేశారు చంద్రబాబు. ఇక ఇప్పుడు మరో జలక్ ఇచ్చారు. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. జనసేన బలమైన నియోజక వర్గంలో భాగమైన గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ను ఫైనల్ చేశారు. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఇక్కడ జనసేన పార్టీకి బాగానే పట్టుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కోన తాతారావు ను బరిలో దించే అవకాశం ఉందని భావించారంతా. కానీ టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో పల్లా శ్రీనివాస్ పోటీలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. దీంతో చంద్రబాబు జనసేన పార్టీకి మోసం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన బలంగా ఉన్న నియోజక వర్గాలలో కూడా టీడీపీనే పోటీ చేయడం. జనసైనికులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి పొత్తులో భాగంగా అన్ని విషయాల్లో సర్దుకుపోతున్న జనసేన పార్టీకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చూడాలి.

Also Read:టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -