పెళ్లి చేసుకోనంటున్న ఛ‌లో హీరోయిన్..

486
Rashmika-Mandanna
- Advertisement -
ఛ‌లో సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం అయింది హీరోయిన్ ర‌ష్మీక మంద‌న‌. త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అంత‌కు ముందు క‌న్న‌డ సినిమా కిరాక్ పార్టీలో ర‌ష్మీక హీరోయిన్ గా న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగులో అమ్మ‌డు చాలా బిజీగా గ‌డుపుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.
rashmika-mandanna
ఈమూవీని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా ఈముద్దుగుమ్మ పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో కొన్ని వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కిరాక్ పార్టీలో ఆమె కోస్టార్ గా న‌టించిన ర‌క్షిత్ శెట్టిని ప్రేమించి 2017 లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. వారిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు సరిగ్గా లేవ‌ని ఆ పెళ్లి ర‌ష్మిక‌కు అస్సలు ఇష్టం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతిలో దాదాపు 5సినిమాలు ఉన్నాయి.
Rashmika_Mandanna
దింతో ఇప్పుడు పెళ్లి చేస‌కుంటే అవ‌కాశాలు అంత‌గా రావ‌ని త‌న పెళ్లిని కూడా వ‌దులుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌ష్మీక కెరీర్ పై దృష్టి పెట్టింద‌ని ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని స‌మాచారం.  ఇటివ‌లూ ర‌ష్మీక‌కు ర‌క్ష్మీత్ ఫోన్ చేసినా ఆమె స్పందించ‌డం లేద‌ని తెలుస్తుంది. ర‌క్ష్మిత్ తో జ‌రిగిన ఎంగేజ్ మెంట్ ను ర‌ష్మీక సిరియ‌స్ గా తీసుకుంట‌లేద‌ని తెలుస్తుంది. చూస్తుంటే ర‌ష్మీక పెళ్లి మ్యాట‌ర్ ను ఇక్క‌డితోనే స్వ‌స్తి ప‌ల‌క‌వ‌చ్చిన తెలుస్తుంది.
- Advertisement -