భువ‌న‌గిరిలో అర‌వింద స‌మేత‌ షూటింగ్….

230
aravinda sametha veera raghava
- Advertisement -
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా అర‌విందస‌మేత వీర రాఘ‌వ‌. రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 60శాతం చిత్ర‌క‌ర‌ణ పూర్తైన‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్డె, ఈషా రెబ్బ‌లు న‌టిస్తున్నారు. ఈచిత్రానికి త‌మ‌న సంగీతం అందిస్తున్నారు.
Ntr, Trivikram movie Aravinda sametha veera raghava shooting in bhuvanagiri..this movie releasing on ocation of dusara october 10th..
ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ ను తెలంగాణ‌లోని భువ‌న‌గిరి స‌మీపంలోని ఓ గ్రామంలోని వెంకటేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో చిత్ర‌క‌ర‌ణ జ‌రుపుతున్నారు. మూవీలోని కీల‌క సన్నివేశాల‌ను అక్క‌డ చిత్ర‌క‌రిస్తున్నారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించ‌న్నాడ‌ని తెలుస్తుంది. ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇక ఈనెల రెండ‌వ వారంలో టీజ‌ర్ ను, వ‌చ్చే నెల‌లో ట్రైల‌ర్ ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 10న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.
- Advertisement -