ముహుర్తం కుదిరింది..

194
nagachaitanya

అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగడానికి సమయం దగ్గరపడుతోంది. 2017లో అక్కినేని బ్రదర్స్ అఖిల్‌..చైతు ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇప్పటికే చిన్నోడు అఖిల్‌కు ఎంగేజ్ మెంట్ కూడా పూర్తైంది. ఇటలీలో పెళ్లి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అఖిల్ విషయం పక్కన పెడితే..టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లవ్ కపుల్స్ చైతు..సమంత ఎంగేజ్ మెంట్ కూడా ముహుర్తం ఫిక్సైంది. నాగచైతన్య నిశ్చితార్థం తేదీ కూడా బయటికొచ్చేసింది. 2017 జనవరి 29న సమంత, నాగచైతన్య నిశ్చితార్థ వేడుక జరగబోతోంది.

nagachaitanya

కొంతకాలంగా చైతు.. సమంత ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. దీంతో పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. నిశ్చితార్ధానికి టైం దగ్గర పడుతుండడంతో నాగ్ ఇప్పటికే నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా ప్రారంభించారట. అంతేకాదు అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. అఖిల్ అన్నయ్య నాగచైతన్య కూడా ఇదే తరహాలో సమంతను పెళ్లాడాలని అనుకుంటున్నాడట. ఏదేమైనా అక్కినేని నాగార్జున ఇంట జరిగే ఈ శుభకార్యాలకు అతిరథ మహారథులు తరలిరావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చైతు..సమంత ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

nagachaitanya