మోడీ.. అరుదైన వీడియో

120
modi

ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్ ద్వారా ఓ అరుదైన వీడియోను పోస్ట్ చేశారు. వాజ్‌ పేయి ప్రధాని ఉన్నప్పుడు అతనితో ఉన్న సన్నిహిత్యాన్ని వీడియో ద్వారా తెలిపాడు. డిసెంబర్ 25న మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 92వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌ ద్వారా వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మా ప్రియమైన అటల్‌ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. అతడు మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. అలాగే ఇండియా అభివృద్ధిపథంలో నడవడంలో వాజ్‌పేయి అందించిన సేవలను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.

modi

ఓ పార్టీ కార్యకర్తను కలిసిన సమయంలో అటల్‌ జీ ఏం చేశారో చూడండి అంటూ.. గతంలో తాను కార్యకర్తగా ఉన్న సమయంలో వాజ్‌పేయిని కలిసిన ఓ అరుదైన వీడియోను మోదీ ట్వీట్‌ చేశారు. అనంతరం స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వాజ్‌పేయి నివాసానికి మోదీ వెళ్లారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పార్టీ సీనియర్‌ నేతలు వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు.