కరోనా..రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

90
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం వరకు 10 వేలకు దిగువలో కేసులు నమోదవుతుండగా ఇవాళ ఏకంగా 22 వేల మార్క్‌ను దాటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.

ఎవరైనా జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన లేకపోవడం, రుచి కోల్పోవడం, విరోచనాలు, అలసట లాంటి సమస్యలతో బాధ పడుతుంటే వారికి “కోవిడ్” సోకినట్లుగా అనుమానించాలని, అప్రమత్తం కావాలని సూచించింది.

ఈ లక్షణాలు ఉంటే.. ఆలస్యం చేయకుండా.. వెంటనే నిర్ధారణ కోసం కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది.. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున.. మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది కేంద్రం.

- Advertisement -