మెల్ బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోహ్లీ సేన. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో భువనేశ్వర్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న ఓపెనర్ అలెక్స్ కారె(5) కోహ్లీ చేతికి చిక్కి ఔటయ్యాడు. 9వ ఓవర్లో కెప్టెన్ ఫించ్ కూడా ఎల్బీడ్యబ్లూగా వెనుదిరిగాడు.
వన్డే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి మ్యాచ్ కావడంతో ఘన విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. వన్డే సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్ టెస్టు సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, జడేజా, చహల్, భువనేశ్వర్, షమీ
ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, జంపా, స్టాన్లేక్, సిడిల్, రిచర్డ్సన్