భారతీయుడు 2లో అక్ష‌య్ కుమార్…

205
Akshay kumar Shankar

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన 2.ఓ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ తో భార‌తీయుడు 2 సినిమా చేస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన భారతీయుడు మూవీ సంచ‌ల‌న విజయాన్ని సొంతం చేసుకుంది. క‌మ‌ల్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా కాజ‌ల్ న‌టిస్తోంది. ఈసినిమాలో సేనాప‌తి మ‌న‌వ‌డి పాత్ర‌లో శింబు క‌నిపించ‌నున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు ప‌లువురు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈమూవీలో విల‌న్ పాత్ర‌కు బాలీవుడ్ న‌టుడిని తీసుకున్నార‌ని స‌మాచారం. శంక‌ర్ తెర‌కెక్కించిన 2.ఓ మూవీలో కూడా అక్ష‌య్ కుమార్ న‌టించాడు. ఈ కాంబినేష‌న్ మ‌రోసారి క‌న్ఫామ్ అయిన‌ట్టు స‌మాచారం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నఈసినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.