సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం..45 మంది మృతి

19
- Advertisement -

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతిచెందారు. బస్సు 165 అడుగుల లోతులో పడటంతో బస్సులో మంటలు చేలరేగాయని తెలిపారు.

ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని …వారంతా బోట్స్‌వానా నుంచి మోరియోకు వెళ్తున్నారని వెల్లడించారు.

కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో బస్సు లోయలో పడిపోయిందన్నారు. ప్రాణాలతో బయటపడిన బాలికను దవాఖానకు తరలించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

Also Read:KTR:బీఆర్ఎస్‌ను ప్రజలే కాపాడుకుంటారు

- Advertisement -