భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కి వర్షం వస్తుందా.?

336
- Advertisement -

టీ20 వరల్డ్‌కప్‌ను వర్షం వదలడంలేదు. వర్షం కారణంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రద్దవడంతో ఆదివారం జరిగే మ్యాచ్ పై అభిమానులకు సందేహాలు నెలకొన్నాయి. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ కు వర్షం అడ్డంకి కానుందా? లేదా మ్యాచ్ కు వరుణుడు ఛాన్స్ ఇస్తాడా అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

పెర్త్ మైదానం బౌలర్లకు స్వర్గధామం. అయితే బ్యాటర్లు ఒక్క సారి క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు వరద పారించవచ్చు. మ్యాచ్‌ జరిగే సమయంలో మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌కు పెద్దగా వర్షం ముప్పు పొం‍చిలేదు. 40 ఓవర్లు పూర్తయ్యే వరకు ఎలాంటి వర్షం ఉండకపోవచ్చని వాతావరణ నిపణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గరికిపాటిపై చిరంజీవి సెటైర్

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ యాక్సిడెంట్

కాంతారకు ఎదురుదెబ్బ ఎందుకో తెలుసా…

- Advertisement -