అండర్19 ప్రపంచకప్‌ షెడ్యూల్…

92
- Advertisement -

దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మొట్టమొదటి అండర్‌19 మహిళల ప్రపంచకప్‌కు సర్వం సిద్దమైంది. ఈ టోర్నీలో 16జట్లు పాల్గొననున్నాయి. ఇందులో కొత్తగా అమెరికా ఇండోనేషియా రువాండా జట్లు ప్రకటించారు. వచ్చే యేడాది జనవరి 7 నుంచి 29వరకు జరిగే ఈ టోర్నీలో జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.

ఇందులో ప్రతి గ్రూప్‌ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ రౌండ్‌కు చేరుకుంటాయి. గ్రూప్‌1 నుండి గ్రూప్‌ ఏ మరియు డీ లు ఉంటాయి. గ్రూప్2 నుండి గ్రూప్‌ బీ మరియు సీ జట్లు పాల్గొంటాయి. ఇందులో మొదటి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జనవరి 27న రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగగా జనవరి 29న ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది.

16 జట్లను ఈ క్రింది విధంగా నాలుగు గ్రూపులుగా విభజించారు:

గ్రూప్ ఏ: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు యూఎస్‌ఏ
గ్రూప్ బీ: ఇంగ్లండ్, పాకిస్థాన్, రువాండా, జింబాబ్వే
గ్రూప్ సి: ఇండోనేషియా, ఐర్లాండ్, న్యూజిలాండ్ మరియు వెస్టిండీస్
గ్రూప్ డీ: భారతదేశం, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా మరియు యూఏఈ

ఇవి కూడా చదవండి…

యూఎస్‌ జట్టుకు భారతీయ మూలాలు…

కెప్టెన్సీకి విలియమ్సన్‌ గుడ్‌ బై

ఫిఫా..అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌

- Advertisement -