- Advertisement -
హైదరాబాద్ జూబ్లిహిల్స్ చెక్ పొస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగం వల్ల ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధి అక్కడికక్కడే ప్రాణాలువిడిచాడు. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత వచ్చే టర్నింగ్ వద్ద ఈప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేయబోయే ప్రయత్నం చేయగా బైక్ అదుపుతప్పడంతో బస్సుకింద పడిపోయారు. దీంతో బస్సు ముందు చక్రాలు ఆ ఇద్దరు విద్యార్దుల మీద నుంచి వెళ్లాయి.
ఈ ప్రమాదంలో ఓ విద్యార్ది అక్కడికక్కడే మృతి చెందిగా మరోకతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇక ఈసంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్ధిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -