ఉగ్రవాద,అవినీతి రహిత దేశంగా భారత్‌

252
piyush ls
- Advertisement -

ప్రతి ఒక్కరికి టాయ్‌లెట్‌తో కూడిన వసతి గృహం కల్పించడమే లక్ష్యమన్నారు పీయూష్ గోయల్. పార్లమెంట్‌లో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆయన 2022లో నవభారతాన్ని చూడబోతున్నారని చెప్పారు.

ద్రవ్యోల్బనం 4.6 శాతానికి పరిమితమైందన్నారు. ప్రజల ఆదాయం రెట్టింపు కావాలన్నారు. ప్రపంచంలో భారత్‌ ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు. ఉగ్రవాద,మత రహిత దేశంగా భారత్ అవతరించాలన్నారు.ఎఫ్‌డీఐ విధానాన్ని సవరించామని రేరాతో రియల్‌ఎస్టేట్ రంగంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. జీఎస్టీతో పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు.

బొగ్గు,స్పెక్ట్రంలను వేలం ద్వారా అనుమతులిచ్చామన్నారు. 3 లక్షల కోట్ల మొండిబకాయిలను రాబట్టామన్నారు. బ్యాంకులపై ప్రజల్లో నమ్మకం పెంచామని తెలిపారు. క్లీన్ బ్యాంకింగ్ తమ లక్ష్యమన్నారు.అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడిపామని వెల్లడించారు.ఈబీసీల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని నిజాయితీగా అమలు చేశామని చెప్పారు.

ప్రధాని గ్రామ సడక్‌ యోజన ద్వారా గ్రామల్లో రోడ్ల సదుపాయం మరింత మెరుగైందన్నారు. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచామని చెప్పారు.

- Advertisement -