కేసీఆర్ బాటలోనే మోడీ..రూ.6 వేల పంటసాయం..

270
piyush
- Advertisement -

143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు అందించామన్నారు పీయుష్ గోయల్. పార్లమెంట్‌లో తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన పీయూష్‌ సమూలంగా అవినీతిని అరికట్టామన్నారు.15.8 లక్షల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. రైతులకు ఏడాదికి రూ. 6 వేల పంటసాయం అందిస్తామన్నారు. మొదటివిడతగా తక్షణమే రూ. 2 వేలు అందిస్తామన్నారు.దీని వల్ల 12 వేల కోట్లు రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. మూడు విడతలుగా రూ. 2 వేల సాయాన్ని అందిస్తామన్నారు.5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.

రైతుల ఆదాయం పెరగాలన్నదే తమ అభిమతమని చెప్పారు. చిన్న,సన్న కారు రైతుల కోసం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. నేరుగా రైతుల అకౌంట్లో డబ్బు జమా అవుతుందన్నారు.గ్రామీణ సడక్ యోజనాకు 19 వేల కోట్లు కేటాయించామన్నారు.

పేదల ఆహార భద్రతకు 1.6 లక్షల కోట్లు కేటాయించామన్నారు.రైతులు పండించిన పంటల కనీస ధరను పెంచామన్నారు.

- Advertisement -