పుష్ప 2..క్రేజీ అప్‌డేట్

13
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌.

2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో ఉన్న అనేక హైలైట్ సీక్వెన్స్ లలో ఇపుడు వరకు జాతర సీక్వెన్స్ కోసం అంతా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా ఛాయాగ్రాహకులు కూబా కన్ఫర్మ్ చేశారు. గతంలో పుష్ప 1 కి ఓ బోట్ సీక్వెన్స్ నీటిలో ఉంటుంది అని టాక్ వచ్చింది. కానీ అది సినిమాలో లేదు కానీ ఈసారి కూబా అయితే సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు.

Also Read:KCR:12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

- Advertisement -