మహారాష్ట్రలో అన్ని స్ధానాల్లో పోటీచేస్తాం: సీఎం కేసీఆర్

28
- Advertisement -

మహారాష్ట్రలో ప్రతీ గ్రామానికి బీఆర్ఎస్ చేరుకుంటుందన్నారు సీఎం కేసీఆర్. నాందేడ్ సదస్సు లో మాట్లాడిన సీఎం…మహాత్ములను కన్న పవిత్ర నేల ఈ మహారాష్ట్ర అన్నారు. కొద్ది రోజుల క్రితమే బి అర్ ఎస్ నే పార్టీ ఆవిర్భవించింది..దేశ ప్రస్తుత పరిస్థితులను మార్చాలనే లక్షం తో బి అర్ ఎస్ ఏర్పాటు చేశామన్నారు. దేశ రాజకీయ పరిస్థితుల పై చర్చించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాయి..ఎన్నో ప్రభుత్వాలు మారాయి..కానీ దేశ పరిస్థితులు మారలేదన్నారు. ఇప్పటికీ తాగటానికి నీరు దొరకదు..కరెంట్ ఉండదన్నారు.

మహారాష్ట్ర లో అత్యధికం గా రైతులు ఆత్మ హత్య లు చేసుకుంటున్నారు..దేశానికి అన్నం పెట్టే వారు అన్నదాతలు అన్నారు. ఇలాంటి వారు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు ఆలోచించాలన్నారు. అందుకే బి అర్ ఎస్ మొదటి నినాదం ..అబ్కి బార్ కిసాన్ సర్కార్ అన్నారు. దేశం లో16 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి..
ప్రభుత్వం ఏర్పాటుకు ఇంతకంటే ఎక్కువ బలం అవసరం లేదన్నారు.

భారత దేశం బుద్ది జీవుల దేశం..రైతుల లో చైతన్యం వస్తె మార్పు తధ్యం అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాయకులు గెలుస్తారు..కానీ ఇపుడు ప్రజలు గెలువాలి ఇదే మేము కోరుకునేదన్నారు. తన 50 ఏళ్ల నా రాజకీయ జీవితం లో ఎన్నో పదవులు అనుభవించిన…నా అనుభవం ప్రకారం చెప్తున్న మనం అమెరికా కంటే కూడా అభివృద్ధి చెందే సత్త ఉందన్నారు. దేశం లో ఉన్న సంపద ప్రజలకు చెందటం లేదు…సాగు కు యోగ్య మైన భూమి మన దేశం లో 50 శాతం కంటే ఎక్కువ ఉందన్నారు. 70 వేల టిఎంసి నీరు నిరుపయోగంగా సముద్రం లో కలుస్తుంది ..ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర జల కమిటీ లు చెప్తున్న లెక్కలు అన్నారు.

నీరు వృధా అవుతున్న చోద్యం చూస్తున్నారు…మహారాష్ట్ర లో కృష్ణ,గోదావరి వంటి నదులు ప్రవహిస్తున్న ఎందుకు నీటి కట కట ఉందన్నారు. దేశాన్ని లో 54 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది ..16 ఏళ్లు బిజెపి పాలించింది..వీళ్ళ మీద వాళ్ళు,వల్ల మీద విల్లు ఆరోపణలు చేసుకోవటం తప్ప దేశానికి చేసింది ఏం లేదన్నారు. మోది ప్రధాని మోది ప్రవేశ పెట్టిన మెక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా గా మారిందని…దేశం లో చైనా బజార్ లు ఉన్నాయి కానీ భారత్ బజార్ ఎందుకు కనిపించదన్నారు. అందుకే మేధావులు అందరూ ఆలోచించాలి.. ఇది మన జీవన్మరణ సమస్య అన్నారు.

కేసీఆర్ మి బిడ్డ ..ప్రపంచం లో అతి పెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉంది దీని కెపాసిటీ 6500 టీఎసీలు అన్నారు. మన దేశం లో ఇన్ని నదులు ఉన్నకాని ఇలాంటి రిజర్వాయర్ లు ఎందుకు లేవు..దేశం లో ప్రతి ఎకరానికి నీరు అందిచెందుకు సంవృద్దిగా వనరులు మన దగ్గర ఉన్నాయి..కానీ ఎందుకు వస్థలేవు ? అన్నారు. ట్రిబ్యునల్ ల పేరుతో కేంద్రం కాల యాపన చేస్తుంది..ఒక్కసారి రైతు రాజ్యం ఏర్పడితే ప్రతి ఎకరా నీటి తో తడుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు కు ముందు అక్కడ చాలా దారుణ మైన పరిస్థితులు ఉండే..కానీ ఎనిమిదేళ్ళ లో వాటి అన్నింటినీ అధిగమించమన్నారు.

24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్నాము..అక్కడ రైతులు ఎన్ని మోటార్లు పెట్టిన అడగము..తెలంగాణ లో దురదృష్ట వశాత్తూ ఎవరైనా రైతు చనిపోతే రైతు భీమా ద్వారా 5 లక్షల సహాయం అందిస్తున్నామన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి 10వేలు ఇస్తున్నాము..రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో ఇలాంటివి సాధ్యం అయినపుడు దేశం లో ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం అవ్తలేవని ప్రశ్నించిన సీఎం..దేశానికి అవసరమైన కరెంట్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు మన దగ్గర పుష్కలంగా ఉంది కానీ కరెంట్ దొరకదు.ఇది చాలా బాధాకరం అన్నారు.

ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం గా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని…రైతుల బతుకుల్లో మార్పు రావాలంటే రైతు రాజ్యం రావాలన్నారు. గులాబీ ప్రభుత్వం ఏర్పాటు అయితే. దేశం లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈరోజు దేశం లో రైతులు చనిపోతున్న ప్రధాని మౌనం వీడటం లేదు..రైతుల ఆత్మహత్యల పై మాట్లాడటం లేదన్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..రైతుల పక్షపాతి నీ..బి అర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఐతే. అన్ని రాష్ట్రాల్లో దళిత బందు ,రైతు బందు అమలు చేస్తాం అన్నారు. మహారాష్ట్ర వాసులకు నా విజ్ఞప్తి..సారి ఎన్నికల్లో ఆలోచించి అవకాశం ఇవ్వండి..10 రోజుల్లో ప్రతి గ్రామానికి బి అర్ ఎస్ చేరుకుంటుంది..అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తం అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -