నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?

76
- Advertisement -

సీజన్ ను బట్టి దొరికే పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. సాధారణంగా నేరేడు పండ్లు వర్షాకాలం ప్రారంభ దశలో దొరుకుతూ ఉంటాయి. ఇవి దొరికినప్పుడు ఏమాత్రం వదలకుండా తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నేరేడు పండులో సకల పోషకాలతో పాటు.. ఎన్నో రోగాలకు దివ్యఔషధంలా పని చేస్తుంది. రుచిలో కాస్త పులుపు తీపి కలగలిపి ఉండే నేరేడులో విటమిన్ సి, విటమిన్ బి వంటి వాటితో పాటు పొటాషియం, కాల్షియం, వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మెటబాలిజం పెంచడంతో పాటు ఆయా రోగాలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు నేరేడు ఒక వరం అని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం ఉన్నవాళ్ళు సీజన్‌లో దొరికే ఈ పండ్ల ను అసలు వదలకూడదట. ఎందుకంటే నేరేడులో షుగర్ ను కంట్రోల్ చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పొటాషియం నేరేడులో అధిక మొత్తంలో ఉంటుంది. నేరేడు పండ్లలో ఆంథోసైనిక్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ రుగ్మతలను మరియు వివిధ రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నేరేడు పండ్లలో ఉండే గుజ్జు యాంటీ మైక్రోబియల్ చర్యలను కలిగి ఉంటుంది.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడి చర్మ ఇన్ఫెక్షన్స్ కు దారి తీసే బ్యాక్టీరియా మరియు ఫంగస్ లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నేరేడు పండు నోటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. చిగుళ్ళ వాపు, నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేసి మౌత్ ఫ్రెషర్ ల ఉపయోగపడుతుంది కేవలం నేరేడు పండులోనే కాకుండా వాటి విత్తనాల్లో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎండబెట్టి పొడి చేసుకొని ప్రతిరోజూ ఒక స్పూన్ తేనెలో కలిపి తాగితే వివిధ రకాల క్యాన్సర్ కారకాలను ఎదుర్కోవచ్చట. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేరేడు పండ్ల ను అసలు మిస్ అవ్వొద్దని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Revanth:గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక

- Advertisement -