వాము వాటర్‌తో ప్రయోజనాలు..

92
- Advertisement -

వాము గురించి మనందరికి తెలుసు.. వంటింట్లో నిత్యం ఆయా వంటకాల్లో వాడే ఒక సుగంధ ద్రవ్యం అని చెప్పుకోవచ్చు. దీనికి ఉండే ఘాటు గుణం కారణంగా వంటల రుచి పెరుగుతుంది. ఇక వామును ఆయుర్వేదంలో వివిధ రోగాలకు సంబంధించి ఔషధాల తయారీలో కూడా వాడతారు. అయితే వామును పొడిగా తీసుకోవడం కంటే వాటర్ రూపంలో తీసుకుంటే ఎంతో మేలని, వాము వాటర్ ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాము వాటర్ ను చాలా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు.

ఒక గ్లాస్ వాము వాటర్ కోసం రెండు టీ స్పూన్ ల వామును దోరగా వేయించి, ఆ వేయించిన వామును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నానబెట్టిన నీటితో పాటు వామును కూడా ఉడికించిన తర్వాత వడకట్టుకొని చల్లార్చుకొని ఆ వాము వాటర్ ను తాగాలి. ఈ యొక్క వాము వాటర్ ను ప్రతిరోజూ ఉదయాన్నే పడగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. వయసు పైబడిన వారిలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సర్వ సాధారణం. ఈ సమస్యలు ఉన్నవారికి వాము వాటర్ మంచి ఔషధకారిణిగా పని చేస్తుంది. ఇక మలబద్దకం, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను కూడా వాము వాటర్ తగ్గిస్తుంది.

ఇంకా దగ్గూ, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజూ వాము వాటర్ తాగితే ఎంతో ప్రయోజనం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రతిరోజూ వాము వాటర్ తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా తొలగిపోతాయట. అంతే కాకుండా రక్తప్రసరణ మెరుగుపడి, హై బీపీ అదుపులోకి వస్తుంది. ఇక గుండె జబ్బులను నివారించడంలో కూడా వాము వాటర్ మంచిగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నా మాట. నేటిరోజుల్లో గుండె సమస్యలు పెరుగుతున్న వేళ వాము వాటర్ తాగడం ఎంతో మంచిదట. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వాము వాటర్ తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక..

- Advertisement -