తెలంగాణ ఉద్యమ సమయంలో అలుపెరగని పోరాటం చేసిన టీబీజీకేఎస్ సంస్థ…ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీబీజేకేఎస్ ఏర్పడిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసి సింగరేణి సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా అన్నారు.
తెలంగాణకు మణిహారం సింగరేణి బొగ్గు గనుల కార్మికులు… అహర్నిశలు శ్రమించి, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం టీబీజీకేఎస్ నిరంతరం కృషి చేస్తుంది. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ కొట్లాడుతుంది.’ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి…