రవి అస్తమించని సామ్రాజ్యానికి ప్రధాని. పైగా కోటీశ్వరుడు. దీంతో ఆయన ఉండే నివాసం ఎంత విలాసవంతంగా ఉంటుందో కలలో కూడా ఊహించలేం. అయితే అలాంటి రాజభోగాలను పక్కనపెట్టి ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు నూతన ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి రిషి సునాక్.
రిషి సతీమణి అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె. రిషి- అక్షిత ఇద్దరి ఆస్తుల విలువ 730 మిలియన్ పౌండ్లు. బ్రిటన్, విదేశాల్లో కలిపి వీరికి నాలుగు ఇళ్లు ఉన్నాయి.
1735 నుండి 10 డౌనింగ్ స్ట్రీట్ బ్రిటిష్ ప్రధాన మంత్రుల నివాసంగా ఉందని ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రధాన మంత్రి నివాస గృహాల కోసం ఖర్చు కోసం 30,000 పౌండ్ల వార్షిక పబ్లిక్ గ్రాంట్‌ను అందుకోనున్నారు. బ్రిటన్ తొలి భారత సంతతికి చెందిన ప్రధానమంత్రిగా సునక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 210 ఏళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన బ్రిటిష్ ప్రధాని. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి కూడా.
ఇవి కూడా చదవండి..
సినిమా వాళ్లతోనూ స్వామీజీ బ్రోకరిజం
రెండో రోజు జోడో యాత్ర సాగిందిలా!