BB6..కెప్టెన్‌గా శ్రీహాన్‌

94
BB6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 53 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం కెప్టెన్‌గా ఎంపికయ్యారు శ్రీహాన్‌. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా చేపల టాస్క్ ఆసక్తికరంగా సాగింది. చివరగా శ్రీహాన్‌ కెప్టెన్‌ అయ్యారు.

కెప్టెన్సీ టాస్క్ కి ముందు గీతూ వల్ల చేపలు ఎక్కువ ఉండి శ్రీ సత్య, శ్రీహన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. వాళ్ళతో పాటు మిగిలిన జంటల్లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ కి ఒక్కొక్కరు వారే సెలెక్ట్ చేసుకొని పంపమని బిగ్ బాస్ చెప్పగా రేవంత్‌- ఇనయ జోడీ నుంచి రేవంత్‌, సూర్య- వాసంతి జంట నుంచి సూర్య, రోహిత్‌- కీర్తి జంట నుంచి కీర్తి, ఫైమా- రాజ్‌ జోడీ నుంచి ఫైమాలు వచ్చారు.

చివరగా కెప్టెన్సీ టాస్క్ కి కంటే ముందు కంటెండర్స్ కి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. కుప్పలుగా, ముడులతో ఉన్న తాళ్లు ఇచ్చి వాటి చిక్కులన్నీ విప్పి స్ట్రైట్ గా చుట్టమని తెలపగా అందరకికంటే ముందు కీర్తి, సూర్య, శ్రీహన్ ముడులు విప్పి ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ కి వెళ్లారు. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ గా వద్దు అనుకుంటున్నారో వారికి కత్తిపోట్లు గుచ్చాలని చెప్పగా కీర్తి, సూర్యకి ఎక్కువ కత్తిపోట్లు వచ్చాయి.దీంతో శ్రీహాన్‌ బిగ్ బాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి..

45ఏళ్ల జీవితంలో గుర్తుపెట్టుకునే సినిమా

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రం

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు నోటీసులు

- Advertisement -