సురభి వాణీదేవికి మద్దతు ప్రకటించిన బ్రాహ్మణ,ఉద్యోగ సంఘాలు

32
surabhi

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవికి సంపూర్ణ మద్దతు తెలిపాయి బ్రాహ్మణ, అర్చక, ఉద్యోగ సంఘాలు. పీవీ నరసింహారావు కూతురు వాణీదేవిని ఏకగ్రీవంగా గెలిపించుకునేలా ప్రతిపక్షాలు సహకరించాలన్నారు రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు గంగు కృష్ణ చైతన్య శర్మ.

పీవీ నరసింహారావు కూతురు వాణి దేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అర్చక ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పీవీ నరసింహారావు కూతురు వాణీదేవికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ అర్చక ఉద్యోగ మతైక సంఘం ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం చంద్రశేఖర శర్మ.

ప్రముఖ దేవాలయాల్లో ఉండే అర్చక, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని…వాణీదేవిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అన్నారు దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి క్రిష్ణమాచారి. సీఎం కేసీఆర్ సముచిత నిర్ణయం తీసుకున్నారు…బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన ప్రాధాన్యతకు సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని నల్గొండ జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుదే లక్ష్మీ నర్సయ్య శర్మ.