24 నుండి మేడారం చిన్నజాతర..

34
medaram

ఈనెల 24 నుంచి మేడారంలో నాలుగు రోజులపాటు చిన్నజాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క, సారలమ్మ ఆలయాల చెంత శుద్ధి నిర్వహించి.. ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో మామిడాకులు కట్టడం, నైవేద్యాలు సమర్పించి… రాత్రి పూట గద్దెల వద్ద పూజారులు జాగారాలు చేయడం ఇలా నాలుగు రోజులూ జాతర సందడిగా ఉంటుంది.

ఈసారి 5 లక్షల మంది వస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో ఎండ తగలకుండా దేవస్థానం చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాల కోసం జంపన్నవాగు వద్ద నీటిపారుదల శాఖ అధికారులు 32 పంపులను సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.భక్తజనం రాకతో మేడారంలో దుకాణాలు కళకళలాడుతున్నాయి. అమ్మవారికి సమర్పించే బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటోంది.