‘బూమరాంగ్‌’ ట్రైల‌ర్‌ విడుద‌ల చేసిన హ‌రీశ్ శంక‌ర్‌..

250
Harish Shankar
- Advertisement -

తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ (తమిళంలో ‘ఇమైక నోడిగల్‌’)తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. నయనతారకు తమ్ముడిగా ప్రారంభ సన్నివేశాల్లో లవర్‌ బాయ్‌గా, పతాక సన్నివేశాలు వచ్చేసరికి యాక్షన్‌ హీరోగా రెండు వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో ప్రేక్షకులందర్నీ మెప్పించారు. రీసెంట్‌గా వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’లో దర్శకుడు కావాలనుకునే యువకుడిగా అధర్వ మురళి అద్భుతంగా నటించారు.

ప్ర‌స్తుతం అధర్వ మురళి యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బూమరాంగ్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ కథానాయికలు. ఆర్‌. కణ్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. జ‌న‌వ‌రి 3న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

Director Harish Shankar

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ – “అధ‌ర్వ నాకు చాలా ఇష్ట‌మైన హీరో. హ్యండ్ స‌మ్ హీరోనే కాదు.. ప్యాష‌నేట్ హీరో కూడా. త‌ను న‌టించిన బూమరాంగ్ సినిమా ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌వుతుండ‌టం ఆనందంగా ఉంది. సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్న నిర్మాత స‌తీశ్‌కుమార్‌కి అభినంద‌న‌లు. ట్రైల‌ర్ చూశాను. అద్భుతంగా ఉంది. సోష‌ల్ మెసేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్ మూవీ ఇది. యూత్ త‌లుచుకుంటే వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పు తేవ‌చ్చున‌నే విష‌యాన్ని ఈ సినిమా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అధ‌ర్వ చ‌క్క‌గా న‌టించాడు. త‌మిళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ సినిమా తెలుగులో మరింత పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌కి స్పెష‌ల్‌ థ్యాంక్స్‌. కమర్షియల్‌ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో `బూమరాంగ్‌` చిత్రం రూపొందింది. ఓ సన్నివేశం తర్వాత మరో సన్నివేశం… నెక్ట్స్‌ ఏం జరుగుతుందనేలా దర్శకుడు చక్కటి స్క్రీన్‌ ప్లే రాశారు. అధర్వ మురళి అద్భుతంగా నటించారు. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. జ‌న‌వ‌రి 3న సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

Boomerang Release Date Poster

నటీనటులు:: సతీష్‌, ఆర్‌జె బాలాజీ, ఉపెన్‌ పటేల్‌ తదితరులు.. సాంకేతిక వర్గం:పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌- ఫణి కందుకూరి, ఆడియో: సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదల,కూర్పు: ఆర్‌.కె. సెల్వ,సంగీతం: రధన్,మాటలు- పాటలు: రాజశ్రీ సుధాకర్‌,ఛాయాగ్రహణం: ప్రసన్న ఎస్‌. కుమార్‌,కథ- స్ర్కీన్‌ప్లే- దర్శకత్వం: ఆర్‌ కణ్ణన్‌,నిర్మాత: సీహెచ్‌ సతీష్‌కుమార్‌.

- Advertisement -