బాలీవుడ్ సింగర్స్ మెలోడి సాంగ్స్ కోసమే పుట్టినట్టు పాడేవారు. అలాంటి వారిలో మన్నా దే ఒకరు. హిందీ చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయన… వేల పాటలను పాడారు. తన కంఠ మాధుర్యంతో ఆయన పాడిన పాటలను ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచాయి. మన్నా దే మే1,1919 న కోల్‌కత్తాలో జన్మించారు. అసలు పేరు ప్రబోద్ చంద్ర దే. సినీరంగంలో క్లాసికల్ వొకలిస్ట్‌గా మంచి పేరు సంపాందించారు. ఈయన ప్రముఖ వొకలిస్ట్ ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ దగ్గర శిష్యరికం చేశారు. ఈయన షోలే, వక్త్, చోరీ చోరీ, కాబులీవాలా, ఆనంద్ లాంటి సినిమాలకు పాటలు పాడారు.త
Also Read: రాధికా మదన్..బర్త్ డే
ఈయన 1950 నుంచి1970 రకు దాదాపు 3500పాటలకు పైగా పాడారు. 2005లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈయన సినీ రంగంలో చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2007సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఈయన 94వ యేటా 2013అక్టోబర్24 బెంగళూరు తుది శ్వాస విడిచారు. ఆయన తన గాత్రంతో… సినిమా ఉన్నంతకాలం నిలిచే ఎవర్‌గ్రీన్ పాటలు పాడారు.
Also Read: ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఇకలేరు