బెట్టింగ్ యాప్స్‌ కేసులు..సీఐడీకి!

18
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైదరాబాద్‌లో నమోదైన కేసులన్నీ విచారించనుంది సీఐడీ.

హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే సైదరాబాద్‌లో 25 మంది బెట్టింగ్ కోసం ప్రచారం చేసిన సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.

అగ్ర హీరోల దగ్గర నుంచి యూట్యూబర్ల వరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో కొంతమందిని విచారించగా మరికొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also Read:మాజీమంత్రి కొడాలి నానికి గుండెపోటు!

- Advertisement -