రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్..

131
Bodakunti Venkateswarlu

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు రావడం లేదని టీఆర్‌ఎస్ జనరల్ సెక్రెటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈ రోజు ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోకాపేట భూముల టెండర్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆన్లైన్ టెండరింగ్‌లో రేవంత్ రెడ్డి వంద కోట్లకు ఎకరా వెయ్యంగ ఎవరు వద్దూ అన్నారు. టెండర్ల విధానం తెలంగాణ ఒక్కటే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న రియల్ భూమ్ ఢిల్లీ-ముంబై-బెంగుళూరు-కోల్కత కూడా లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 7 నుంచి 14 కోట్లు మినిమమ్ ధర పెట్టారు. భూ అమ్మకాలపై అన్ని రకాల ప్రకటనలు ప్రభుత్వం చేసింది. 5 కోట్ల డిపాజిట్ చేసి టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకరు వేసిన టెండర్లు మరొకరికి ఆన్లైన్ అయినా పారదర్శకంగా టెండరింగ్ జరిగింది. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో భూములు అమ్మి ఆంధ్రకు ఖర్చు చేశారు కాబట్టే ఆనాడు భూ అమ్మకాలను అడ్డుకున్నాము. హైదరాబాద్ బ్రాండ్‌ను తగ్గించే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించొద్దు అని వెంకటేశ్వర్లు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిక్కుమాలిన విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.