రేవంత్ రెడ్డిని మించిన కరప్షన్ కింగ్ ఎవ్వరూ లేరు..

25

రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఈరోజు లంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని మించిన కరప్షన్ కింగ్ ఎవ్వరూ లేరు. కరోన కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగడం లేదనే బాధ ప్రతిపక్షాల్లో కనిపిస్తోందని విమర్శించారు. రాజపుష్ప సంస్థ తెలంగాణ ఏర్పాటుకు ముందే లీడింగ్ రియలేస్టేట్ సంస్థ. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ వదిలేస్తే కాంగ్రెస్ బాగుపడుతుంది. రాబోయే ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలిచే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వల్ల అవికూడా గెలువవు అని శ్రీనివాస్ రెడ్డి ద్వజమెత్తారు.