సావర్కర్‌కు జాతిపిత హోదా..బీజేపీ ప్లాన్ ఇదే

124
rajnath
- Advertisement -

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ త్వరలో జాతిపితగా మహాత్మాగాంధీని తొలగించి వీర్ సావర్కర్‌ను జాతిపితగా ప్రకటించాలని చూస్తోందని మండిపడ్డారు. గాంధీజీ తన జీవితకాలంలో చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారని ఒక్కసారి కూడా గాంధీ దయ కోరుకోలేదని గుర్తు చేశారు. గాంధీజీ క్షమాభిక్ష పిటిషన్ రాయమని సావర్కర్‌ను అడిగారని రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దమని తెలిపారు.

వినాయక్ దామోదర్ సావర్కర్.. పుస్తకాన్ని రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన రాజ్‌నాథ్‌…గాంధీజీ తనకు క్షమాభిక్ష పిటిషన్ రాయాలని సావర్కర్‌ని కోరారని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నాయి. బీజేపీ నాయకులు చరిత్రను ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని.. తప్పుడు చరిత్రను భవిష్యత్ తరానికి అందించడం మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -