హైదరాబాద్‌ నుండి పోటీ చేయి:రాహుల్‌కు ఒవైసీ సవాల్‌

12
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. రాహుల్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుండి కాకుండా హైదరాబాద్ నుండి పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు.

హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఒవైసీ… కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపించారు. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉన్నారు… క్షేత్రస్థాయికి వచ్చి తనపై పోరాడాలని సూచించారు.

ఈ నెల ఆరంభంలో తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎం పార్టీలు ఐక్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌కు కౌంటర్ ఇచ్చారు ఓవైసీ.

Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -